టీమిండియా ఘన విజయం..!

70

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా భారీ విజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సంపాదించింది. ఏడాది తర్వాత స్వదేశంలో ఆడిన టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు అన్ని విభాగాల్లో రాణించి అత్యద్భుత విజయం నమోదు చేసింది. 395 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పర్యాటక జట్టు 191 పరుగులకే కుప్పకూలింది.