స్టేడియంలో గాయాలపాలైన శ్రీలంక క్రికెటర్

వరల్డ్ కప్ లో ఓ మోస్తరు ప్రదర్శన కనబర్చిన శ్రీలంక జట్టు సొంతగడ్డపై రెచ్చిపోయింది. బంగ్లాదేశ్ తో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను 3-0తో స్వీప్ చేసింది. అయితే, చివరి వన్డే ముగిసిన తర్వాత మైదానంలో సంబరాలు చేసుకుంటున్న తరుణంలో చిన్న అపశ్రుతి చోటుచేసుకుంది. సిరీస్ బహుమతుల ప్రదానోత్సవంలో లంక ఆటగాళ్లకు రెండు స్పోర్ట్స్ బైకులు ఇచ్చారు. వాటిలో ఒకదానిపై లంక విధ్వంసక ఆటగాడు కుశాల్ మెండిస్, మరో ఆటగాడు ఎక్కారు. మైదానంలో జోరుగా బండి నడిపిన మెండిస్ వేగంగా మలుపుతిప్పబోయి కిందడిపోయాడు. వెనుక కూర్చున్న ఆటగాడు తప్పించుకోగా, మెండిస్ మాత్రం బండి కింద చిక్కుకుపోయాడు. వెంటనే ఇతర ఆటగాళ్లు, సిబ్బంది అక్కడికి చేరుకుని మెండిస్ ను పైకి లేపారు. ఈ ఘటనలో మెండిస్ కు స్వల్ప గాయాలు అయినట్టు తెలుస్తోంది.

https://twitter.com/RooterSports/status/1156889708208766976