ఫైనల్‌కు చేరుకున్న న్యూజీలాండ్

240 పరుగుల విజల లక్ష్యంతో బరిలో దిగిన భారత్‌ గెలుపు ముగింట ఓడింది. టీమిండియా 221 పరుగులకు ఆలౌటయ్యింది. ఓ దశలో 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా… 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో పాండ్యా (32), పంత్ (32) భారత్‌ను ఆదుకున్నారు. కానీ శాంటర్న్ వీరిద్దర్నీ తెలివిగా బురిడీ కొట్టించాడు. దీంతో భారత్ 92 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత్ ఓటమి లాంఛనమే అనుకుంటున్న దశలో ధోనీ, జడేజా అద్భుత భాగస్వామ్యంతో ఆదుకున్నారు. దూకుడుగా ఆడిన జడేజా 77 పరుగుల వద్ద భారీ షాట్‌కు యత్నించి క్యాచ్ ఔటయ్యాడు. 

చివరి రెండు ఓవర్లలో భారత్ విజయానికి 31 పరుగులు అవసరం కాగా. ఫెర్గ్యుసన్ విసిరిన తొలి బంతికి ధోనీ సిక్స్ కొట్టాడు. దీంతో భారత్ విజయానికి 10 బంతుల్లో 25 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో రెండో పరుగుకు యత్నించిన ధోనీ.. గుప్టిల్ డైరెక్ట్ త్రో విసరడంతో రనౌటయ్యాడు. దీంతో భారత్ ఆశలు అడియాసలయ్యాయి. 

24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో పంత్ (32), పాండ్య (32) భారత్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దర్నీ శాంట్నర్ బుట్టలో వేసుకోవడంతో.. భారత్ 92 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ధోనీ, జడేజా మెల్లగా ఆడుతూ.. స్కోరు బోర్డును 100, 200 పరుగుల మార్క్ దాటించారు. ధోనీ నెమ్మదిగా ఆడగా.. బ్యాట్ ఝలిపించిన జడేజా 39 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. జడేజాకు వన్డేల్లో ఇది 11వ అర్ధ శతకం. భారత్ 46 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. భారీ షాట్‌కు యత్నించిన జడేజా 77 పరుగుల వద్ద ఔటయ్యాడు. 

వికెట్లు పడ్డాయిలా..
హెన్రీ విసిరిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో రోహిత్ (1) కీపర్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత్ 4 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. బౌల్ట్ విసిరిన మరుసటి ఓవర్లోనే కోహ్లి ఎల్బీగా అవుటయ్యాడు. విరాట్ డీఆర్ఎస్ కోరినప్పటికీ ఫలితం లేకపోయింది. రోహిత్, కోహ్లి సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరడం 2017 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

మరుసటి ఓవర్లోనే రాహుల్ కూడా కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో భారత్ ఐదు పరుగులకే 3 కీలక వికెట్లను చేజార్చుకుంది. ఓపికగా 20 బంతులు ఆడిన దినేశ్ కార్తీక్ (6).. 21వ బంతికి ఫోర్ కొట్టి ఖాతా తెరిచాడు. అనంతరం హెన్రీ బౌలింగ్‌లో నీషామ్ స్టన్నింగ్ క్యాచ్ పట్టడంతో కార్తీక్ ఔటయ్యాడు. ఫెర్గ్యుసన్ వేసిన 12.1 ఓవర్లో పంత్ ఇచ్చిన క్యాచ్‌ను పట్టడంలో నీషామ్ విఫలమయ్యాడు. దీంతో 19 పరుగుల వద్ద పంత్‌కు లైఫ్ వచ్చింది. 

16.5 ఓవర్లలో 50 పరుగుల మార్క్‌ను చేరుకున్న భారత్.. 22.5 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. శాంట్నర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన పంత్ (32) గ్రాండ్‌హోమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత్ మరోసారి ఇబ్బందుల్లో పడింది. పంత్ స్థానంలో ధోనీ క్రిజులోకి వచ్చాడు. ధోనీకి ఇది 350వ వన్డే మ్యాచ్ కావడం గమనార్హం. 

కివీస్ 239/8
భారత్‌తో జరుగుతోన్న వరల్డ్ కప్ సెమీఫైనల్లో కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసిన దశలో మంగళవారం వర్షం కురవడంతో మ్యాచ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. బుధవారం మ్యాచ్ తిరిగి ప్రారంభం కాగా.. భారత పేసర్లు బుమ్రా, భువీ ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. దీంతో కివీస్ జట్టు 239/కే పరిమితమైంది. 

మంగళవారం నాటి స్కోరుకు 10 పరుగులు జోడించిన అనంతరం కివీస్.. వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. 90 బంతుల్లో 74 పరుగులు చేసిన టేలర్ జడేజా డైరెక్ట్ త్రో ద్వారా రనౌట్ చేయగా.. తర్వాత భువి బౌలింగ్‌లో టామ్ లాథమ్.. జడ్డూకే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. భువి వేసిన 49వ ఓవర్లో హెన్రీ (1) కోహ్లికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.