ప్రపంచకప్ నుంచి శిఖర్ ధావన్ ఔట్

ప్రపంచకప్ లో సత్తా చాటుతున్న టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. డ్యాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రపంచకప్ కు దూరమయ్యాడు. ఆదివారంనాడు ఆస్ట్రేలియా జరిగిన మ్యాచ్ సందర్భంగా ధావన్ గాయపడ్డాడు. ఎడమచేతి బొటనవేలికి ఫ్యాక్చర్ అయినట్టు స్కానింగ్ లో తేలింది. ఈ నేపథ్యంలో మూడు వారాల పాటు జట్టుకు ధావన్ దూరమవుతున్నాడు. దీంతో, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, వెస్టిండీస్, ఇంగ్లండ్ లతో జరగనున్న మ్యాచ్ లను ధావన్ లేకుండానే టీమిండియా ఆడనుంది. ధావన్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ లేదా రిషభ్ పంత్ లు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.