నేడు ఆస్ట్రేలియాతో టీమిండియా ‘ఢీ’

దాదాపు 16 సంవత్సరాల తరువాత గ్రూప్ దశలోనే భారత్, ఆస్ట్రేలియాలు నేడు వరల్డ్ కప్ పోటీలో భాగంగా తలపడనున్నాయి. 2003 తరువాత ప్రపంచకప్ లో ఈ రెండు దేశాలూ గ్రూప్ దశలో ఆడటం ఇదే ప్రధమం. ఇప్పటివరకూ వరల్డ్ కప్ లో రెండు జట్ల మధ్యా 11 మ్యాచ్ లు ఆడగా, మొగ్గు ఆసీస్ వైపే ఉంది. భారత్ కేవలం 3 మ్యాచ్ లు గెలువగా, ఆసీస్ 8 మ్యాచ్ లు గెలిచింది.

ఇక ఈ మ్యాచ్ ఆస్ట్రేలియాకు ఓ పెను సవాలు వంటిదేనని ఆ దేశ మాజీ క్రికెటర్ అలెన్ బోర్డర్ అభిప్రాయపడ్డాడు. జాగ్రత్తగా ఆడకుంటే ఆసీస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించాడు. భారత జట్టులోనూ కొన్ని బలహీనతలు ఉన్నాయని, ఈ వరల్డ్ కప్ లో ఆడే అన్ని జట్లకూ భారత్ గట్టి ప్రత్యర్థేనని అన్నాడు. ఆ జట్టులో రోహిత్ శర్మ, కోహ్లీ, జస్ ప్రీత్ బుమ్రా వంటి ప్రపంచస్థాయి ఆటగాళ్లు ఉన్నారని గుర్తుంచుకోవాలని అన్నాడు.

ఇక నేటి మ్యాచ్ లో జట్లను పరిశీలిస్తే (అంచనా)
ఇండియా: శిఖర్ ధావన్‌, రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), కేఎల్ రాహుల్‌, ఎంఎస్ ధోనీ, కేదార్ జాదవ్‌/విజయ్‌ శంకర్‌, హార్దిక్‌, భువనేశ్వర్‌/షమి, కుల్దీప్‌, చాహల్‌, బుమ్రా.
 ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్‌ (కెప్టెన్‌), డేవిడ్ వార్నర్‌, ఉస్మాన్ ఖవాజా, స్మిత్‌, మ్యాక్స్‌ వెల్‌, స్టొయినిస్‌, క్యారీ, కల్టర్‌ నైల్‌, కమిన్స్‌, స్టార్క్‌, జంపా.