ప్రపంచకప్ కు టీమిండియా జట్టుఇదే !

ఇంగ్లండ్ జరగనున్న ప్రపంచకప్ లో ఆడబోయే టీమ్ ను బీసీసీఐ ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టులో విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, ధోనీ (వికెట్ కీపర్), కేదార్ జాధవ్, దినేశ్ కార్తీక్ (సెకండరీ వికెట్ కీపర్), యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మొహమ్మద్ షమీలు ఉన్నారు.

ప్రధాన పేసర్లుగా భువనేశ్వర్, బుమ్రా, షమీలను తీసుకోగా… స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, చాహల్ లను సెలెక్ట్ చేశారు. ఆల్ రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, జడేజా, జాధవ్, విజయ్ శంకర్ లకు జట్టులో స్థానం దక్కింది.

జట్టు ఎంపికకు సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టు నియమిత కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఎఏ) సమావేశమైంది. ముంబైలోని బీసీసీఐ క్రికెట్ సెంటర్ లో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, కెప్టెన్ కోహ్లీ, చీఫ్ కోచ్ రవిశాస్త్రి సహా పలువురు బీసీసీఐ ఉన్నతాధికారులు హాజరయ్యారు.