కుమ్మేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజా సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ హ్యాట్రిక్ విజయం నమోదుచేసింది. ఆదివారం రాత్రి జరిగిన పోరులో చెన్నై జట్టు 8 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ పై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ ధోనీ చలవతో 175 పరుగులు చేసింది. ధోనీ 46 బంతుల్లో 75* పరుగులు చేశాడు. ఈ లెజెండ్ స్కోరులో 4 ఫోర్లు, 4 సిక్సులున్నాయి. అనంతరం, 176 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు మాత్రమే చేయగలిగింది. బెన్ స్టోక్స్ 46 పరుగులు చేసి జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. సూపర్ కింగ్స్ బౌలర్లు చహర్, తాహిర్, బ్రావో, ఠాకూర్ తలా రెండు వికెట్లతో రాయల్స్ పనిబట్టారు.