నేడే సిరీస్ నిర్ణాయక మ్యాచ్..

భారత్‌ నాలుగో వన్డేలో చేసిన కొన్ని ఫీల్డింగ్‌ తప్పిదాలు, బౌలింగ్‌ వైఫల్యాలను అధిగమించి నేడు ఆసీస్‌తో జరిగే సిరీస్‌ నిర్ణాయక చివరి మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది. ప్రస్తుత భారత బౌలర్లను క్రికెట్‌ ప్రపంచం ప్రశంసిస్తోన్నప్పటికి.. మొహాలీలో భారీ స్కోరును కాపాడటంలో వారు వైఫల్యం పొందటంతో ప్రశ్న మళ్లి మొదటికొచ్చినట్లు కన్పిస్తోంది. ఇప్పటివరకు ఆధారపడదగ్గ బౌలర్‌గా భావిస్తున్న జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌ను కూడా ఆస్టన్‌ టర్నర్‌ తేలికగా ఎదుర్కొన్నాడు. మరోవైపు కోహ్లీ అతని కోటా ఓవర్లను ఉపయోగించుకున్న తీరు కూడా భారత్‌ ఓటమిపై ప్రభావం చూపిందని విశ్లేషకులంటున్నారు. కోహ్లీతో పాటు, భారత జట్టు ధోనీ లేని లోటుతో ప్రభావితమైంది. ఒత్తిడి సందర్భాల్లో ధోనీ ఆటగాళ్లలో నింపే స్థైర్యం ఉపయోగకరంగా ఉంటుంది. నాలుగు వన్డే జరిగిన మొహాలీలోని పీసీఏ స్టేడియం పిచ్‌ ఫ్లాట్‌గా ఉంది. అది బ్యాటింగ్‌కు అనుకూలమైనది. బౌలర్లకు ఏమాత్రం సహకరించని నేపథ్యం కలిగివుంది. 350కు పైగా పరుగులు నమోదు చేసినప్పటికి.. ఆ పరుగులను కాపాడుకోవడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. టర్నర్‌ దూకుడు ముందు మన బౌలర్లు నిలువలేకపోయారు. రాంచిలో జరిగిన మూడో వన్డేలో భారత్‌ తొలుత బౌలింగ్‌ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా బౌలర్ల ముందు మన బ్యాట్స్‌మెన్‌ విఫలమైయ్యారు. మొహాలీలో జరిగిన నాలుగో వన్డేలో భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఇక్కడ మన బౌలర్లు బ్యాట్స్‌మెన్‌ చేసిన పరుగులను కాపాడటంలో చేతులెత్తేశారు. ఈ రెండు మ్యాచులతో ఆసీస్‌ రెండు రంగాల్లో తన ఆధిక్యతను చాటింది. ఇదే జోరుతో తమ జట్టు ప్రపంచకప్‌లోకి దిగుతుందని ఆజట్టు వైస్‌ కెప్టెన్‌ అలెక్స్‌ కేరీ మంగళవారం వ్యాఖ్యానించడం ఆసీస్‌ మునపటి ఆత్మవిశ్వాసాన్ని పొందిందని నిరూపిస్తోంది.
ఫిరోజ్‌షా కోట్లాలో స్లో పిచ్‌..
ఇక్కడ పిచ్‌ స్లోగా ఉండటంతో బంతి బౌన్స్‌ తక్కువగా ఉండే అవకాశముందని విశ్లేషకుల అంచనా. ఇక్కడ టాస్‌ గెలవడం కీలకం. ఈ మైదానంలో ఎక్కువ స్కోర్లు నమోదు చేయడం కష్టమే.. భారత్‌ ఇక్కడ చివరిసారిగా ఆడిన రెండు వన్డేల్లో ఒకటి గెలవగా మరొక మ్యాచ్‌ ఓడింది. 2016 అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో ఆడిన మ్యాచ్‌లో భారత్‌ 6 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 2014లో వెస్టిండీస్‌తో ఆడిన మ్యాచ్‌లో భారత్‌ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. ధావన్‌ తిరిగి ఫామ్‌లోకి రావడం భారత జట్టుకు ఊరటనిస్తోంది. ఇటీవల వరుసగా విఫలమైన ధావన్‌ మొహాలీ వన్డేలో సెంచరీతో రాణించడం జట్టుతోపాటు అభిమానులను సంతోషపరుస్తోంది. తన సొంత మైదానంలో ఆడుతున్న ధావన్‌ మరిన్ని పరుగులు చేస్తాడని ఆశిస్తున్నారు. అయితే పిచ్‌ భారీ షాట్లు ఆడటానికి అవకాశమిస్తుందన్నది సందేహమే. ఈ పిచ్‌పై స్పిన్నర్లు చాహల్‌, కుల్దిdప్‌లు రాణి ంచే అవకాశముంది. గతంలో ఇక్కడ ఆడిన మ్యాచుల్లో వీరిద్దరు మెరిశారు.
ఆసీస్‌ టాప్‌ ఆర్డర్‌ను కూల్చితేనే..
ఆసీస్‌ టాప్‌ ఆర్డర్‌లో ఉస్మాన్‌ ఖవాజా, ఫించ్‌, మార్ష్‌, హాండ్స్‌కోంబ్‌, మాక్స్‌వెల్‌తోపాటు టర్నర్‌లను త్వరగా ఔట్‌చేస్తేనే భారత్‌ అనుకున్న ఫలితాలను పొందే వీలుంటుంది. ఇందుకు భారత్‌ జట్టులోకి బౌలింగ్‌ విభాగం సమష్టిగా రాణించాల్సి ఉంటుంది. లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో పకడ్బంధీగా బంతులను సందించాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో విశేషంగా రాణించిన ఆటగాళ్లను ప్రపంచకప్‌లో ఆడే జట్టులోకి తీసుకోవడానికి సెలెక్షన్‌ బోర్డు పరిశీలనలోకి తీసుకుటుందని సుస్పష్టం. టాప్‌, మిడిలార్డర్‌లో పంత్‌, శంకర్‌, కెఎల్‌ రాహుల్‌, రవీంద్రజడేజాలు తమ ప్రత్యేకతను చాటాల్సి ఉంది. వీరిలో ఎవరికి ప్రపంచకప్‌ బెర్త్‌లు దక్కుతాయో నేటి మ్యాచ్‌ పూర్తయితేగాని స్పష్టం కాదు. రవీంద్ర జడేజా నేటి మ్యాచ్‌లో చివరి 11మందిలో ఉండే అవకాశముంది. పిచ్‌ స్పిన్‌కు అనుకూలిస్తుందన్న నేపథ్యంలో జడేజా బరిలోకి దిగే అవకాశముంది.
జట్లు: భారత్‌: విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, అంబటి రాయుడు, కేదార్‌ జాదవ్‌, విజయ్‌ శంకర్‌, కుల్దిdప్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, రవీంద్ర జడేజా, యజువేంద్ర చాహల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, రిషభ్‌ పంత్‌ (వి.కీ)
ఆస్ట్రేలియా: ఆరోన్‌ ఫించ్‌(కెప్టెన్‌),ఉస్మాన్‌ ఖవాజా, పీటర్‌ హాండ్స్‌కోంబ్‌, షువాన్‌ మార్ష్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టొయినిస్‌, ఆస్టన్‌ టర్నర్‌, జే రిచర్డ్‌సన్‌, ఆడం జంపా, అండ్రూ టై, పాట్‌ కమిన్స్‌, నాథన్‌ కోల్టిdర్‌-నైల్‌, అలెక్స్‌ కేరీ, నాథన్‌ లియాన్‌, జాసన్‌ బెహ్రెన్‌డార్ఫ్‌.