వెస్ట్ ఇండీస్ తో తొలి టెస్ట్ నేడే ప్రారంభం..!

నేటి నుంచి వెస్ట్ ఇండీస్ తో రాజ్ కోట్ వేదికగా భారత్ టెస్ట్ పోరుకు సిద్ధమైంది. టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో ఉన్న వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఈరోజు మొదటి టెస్టులో ప్రారంభం కానుంది. 2013 తర్వాత భారత్‌లో టెస్టు మ్యాచ్‌ ఆడడం విండీస్‌కు ఇదే తొలిసారి. ముంబైకి చెందిన 18 ఏళ్ల యువ బ్యాట్స్‌మన్‌ పృథ్వీ షా టెస్ట్ అరంగేట్రం ఖాయమైంది. కేఎల్‌ రాహుల్‌తో కలిసి పృథ్వీ ఇన్నింగ్స్‌ ఆరంభించనున్నాడు.

కఠినమైన ఆస్ట్రేలియా పర్యటనకు మెరుగ్గా సన్నద్ధమవడానికి వెస్టిండీస్‌ సిరీస్‌ను ఉపయోగించుకుంటాం.. అని కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. భారత్ తన ఆర్డర్ లో పలు మార్పులు చేసింది. ప్రధాన పేసర్లు బుమ్రా, భువనేశ్వర్‌కు విశ్రాంతి లభించింది. భారత్‌.. పూర్తి స్థాయి జట్టుతో లేకున్నా భారత్ తో అంతగా అనుభవంలేని వెస్టిండీస్‌పై విజయం లాంఛనమే కావొచ్చని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనున్న నేపథ్యంలో బీసీసీఐ క్యురేటర్లు రాజ్‌కోట్‌లోనూ బౌన్సీ పిచ్‌ను తయారు చేస్తున్నట్లు సమాచారం.

Post expires at 1:03pm on Thursday October 4th, 2018