యో-యో టెస్టుకు విరాట్..!

వెస్టిండీస్‌తో జరగబోయే టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ యో-యో టెస్టుకు వెళ్లనున్నాడు. ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడానికి సెప్టెంబరు 28న యో-యో టెస్టుకు హాజరుకానున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఫిట్‌నెస్‌కి సంబంధించి కోహ్లీ ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆసియాకప్‌కు దూరమవ్వడానికి ఇది కూడా ఒక కారణం. దీంతో యో-యో టెస్టుకు హాజరవ్వాల్సిందిగా సెలెక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది. ఆసియా కప్‌లో భాగంగా దుబాయ్‌లో ఉన్న టీమిండియా ఆటగాళ్లు స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత యో-యో టెస్టులో పాల్గొంటారని సమాచారం.