Breaking News

అస‌లు సిస‌లు లా అండ్ ఆర్డ‌ర్ అంటే ఏంటో నేర్పిస్తాం.. నారా లోకేష్

19 th Sep 2021, UTC

ఏపీ సీఎం వైఎస్ జగన్ రివర్స్ టెండర్ల నుంచి రివర్స్ కేసుల వరకూ వచ్చారని మాజీ మంత్రి నారా లోకేష్  ట్విట్టర్ లో ఎద్దేవా చేసారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంట్లోకి చొరబడిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ కు స్టేషన్ బెయిల్ ఇచ్చి టీడీపీ కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని లోకేష్ ఆరోపించారు. పోలీసు అధికారులకు  రాబోయే రోజుల్లో అసలు సిసలు లా అండ్ ఆర్డర్ అంటే ఏంటో నేర్పిస్తామని హెచ్చరించారు.

ప్ర‌మాణ‌స్వీకారం రోజు నుంచే రివ‌ర్స్ పాల‌న ఆరంభించి రాష్ట్రాన్ని అధోగ‌తి పాలుచేసిన @ వైఎస్ జగన్ రివ‌ర్స్ టెండ‌ర్లు మీదుగా ఇప్పుడు రివ‌ర్స్ కేసుల వ‌ర‌కూ వ‌చ్చారు. జెడ్‌ప్ల‌స్ భ‌ద్ర‌త వున్న మాజీ ముఖ్య‌మంత్రి @ నారా చంద్రబాబు నాయుడు గారి పై దాడి చేసేందుకు పోలీసులు సాయంతో ఇంట్లోకి చొర‌బ‌డిన‌వైసీపీ ఎమ్మెల్యే జోగి ర‌మేష్ అత‌ని గూండాల అకృత్యాలు ప్ర‌పంచ‌మంతా చూసింది. తీవ్రంగా గాయ‌ప‌డిన బాధితులైన‌ టిడిపి నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పోలీస్‌స్టేష‌న్‌కి వెళ్తే .. రివ‌ర్స్‌గా వారిపైనే నాన్‌బెయిల‌బుల్, జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు ఆయుధ‌మైన ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు బ‌నాయించారు

చంద్ర‌బాబు గారి ఇంటిపై దాడిచేసి, టిడిపి నేత‌ల్ని గాయ‌ప‌రిచిన‌ నిందితులైన వైకాపా ఎమ్మెల్యే జోగి ర‌మేష్‌కి స్టేష‌న్ బెయిల్ రేంజు కేసు పెట్టి రివ‌ర్స్ పోలీసింగ్‌ అంటే ఏంటో చూపించారు. బాధితుల్ని బంధిస్తూ.. ముద్దాయిల్ని ముద్దుగా చూసుకుంటోన్న ఈ వైపీఎస్ ఆఫీస‌ర్లు రెండున్న‌రేళ్ల‌లో రిటైర్ అవ్వ‌రు క‌దా! జ‌గ‌న్ క్రిమిన‌ల్ స్కూల్ లా అమ‌లు చేస్తోన్న వీరికి అస‌లు సిస‌లు లా అండ్ ఆర్డ‌ర్ అంటే ఏంటో రాబోయే రోజుల్లో నేర్పిస్తాం అంటూ లోకేష్ ట్వీట్ చేసారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox