Breaking News

ఏపీలో కొనసాగుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్

19 th Sep 2021, UTC

ఆంధ్రప్రదేశ్  వ్యాప్తంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతుంది. మొత్తం 515 జడ్పీటీసీ స్థానాలకు 2,058 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలకు గాను 2,371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వివిధ కారణాల రీత్యా ఎన్నికల ప్రక్రియ 375 స్థానాల్లో నిలిచిపోయింది. కాగా పోటీ చేసిన వారిలో 81 మంది అభ్యర్థులు మరణించారు. మిగిలిన 7,220 స్థానాలకుగాను 18,782 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఏప్రిల్‌ 8వ తేదీన ఆయా స్థానాలకు జరిగిన పోలింగ్‌లో మొత్తం 1,29,55,980 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కొవిడ్‌ జాగ్రత్తలతో 13 జిల్లాల్లో ఓట్ల లెక్కింపు నిమిత్తం 209 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో  స్దానిక సంస్దల ఎన్నికల  కౌంటింగ్ జరుగుతున్న  సమయంలో సమాచార శాఖ ఫోన్లు బంద్ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా సమాచార శాఖకు చెందిన ఉద్యోగుల సెల్ ఫోన్లు అన్నీ మూగబోయాయి. బిల్లులు చెల్లించకపోవడంతో ప్రొవైడర్లు సర్వీసును నిలిపివేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిషత్ ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న సమయంలో ఫోన్లు పనిచేయకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 13 జిల్లాలకు సంబంధించి మొత్తం సమాచారశాఖ అధికారుల ఫోన్లు బంద్ అయ్యాయి. దీంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 కౌంటింగ్ నేపథ్యంలో ఏదైనా సమాచారం  ఇవ్వాలన్నా, రిసీవ్ చేసుకోవాలన్నా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల కౌంటింగ్ కేంద్రాలకు అధికారులు, మీడియా ప్రతినిధులు వెళ్లే అవకాశం లేదు. దీంతో వారికి సమాచారం ఇవ్వాలన్నా ఫోన్లు పనిచేయడంలేదు. సమాచార శాఖలోని ముఖ్య అధికారుల దగ్గర నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు అందరి ఫోన్లు బంద్ అయ్యాయి. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox