Machilipatnam district should be named after ANR: ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలు ఏర్పాటుకు రంగం సిద్దమయింది. ప్రస్తుతం 13 జిల్లాల తో వున్న రాష్ట్రంలో ఉగాదినుంచి 26 జిల్లాలు కొలువుదీరబోతున్నాయి. మరోవైపు జిల్లా కేంద్రాల ఏర్పాటు, వాటి పేర్లపై ప్రజలకు, రాజకీయ నేత లకు మధ్య వివాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. పలు చోట్ల నిరసనలు, బంద్ లు జరుగుతున్నాయి. వీటిలో అధికార పార్టీ నేతలు కూడ వుండటం విశేషం.
మరోవైపు విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాకు మాజీ సీఎం ఎన్టీరామారావు పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో జన్మించి సినీ రంగంలోకి ప్రవేశించి అగ్రనటుడిగా కొనసాగుతూ రాజకీయాల్లోకి వచ్చారు. తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా కూడ పనిచేసారు. ఎన్టీఆర్ పేరును జిల్లా కు పెట్టడం పై ఆయన కుటుంబ సభ్యులు కూడ సంతోషం వ్యక్తం చేసారు.మరోవైపు సినీ రంగంలో ఎన్టీఆర్ తో పాటు అగ్రనటుడగా కొనసాగిన దివంగత అక్కినేని నాగేశ్వరరావుది కూడ కృష్ణా జిల్లానే కావడం గమనార్హం. దీనితో ఏఎన్నార్ అభిమానులు కూడ తమ అభిమాన నటుడి పేరును ఒక జిల్లాకు పెట్టాలని కోరుతున్నారు.
జిల్లాలను విభజించిన తర్వాత కొత్త జిల్లా మచలీపట్నం కు దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరు పెట్టాలని అక్కినేని అభిమానులు అభ్యర్ధన చేస్తున్నారు. ఏపీ సర్కార్ తమ కోరికను దృష్టి లో పెట్టుకోవాలని ఆలిండియా అక్కినేని అభిమాన సంఘం అధ్యక్షుడు సర్వేశ్వరరావు కోరుతున్నారు. మరి వీరి కోరికను సర్కార్ పట్టించుకుంటుందా లేదా అన్నది చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు చదవండి
హీరో విజయ్ రోల్స్ రాయిస్ కేసు: సింగిల్ జడ్జి బెంచ్ వ్యాఖ్యలను తొలగించిన మద్రాస్ హైకోర్టు
పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ప్రకటించడం పై వ్యతిరేకత నేడు హిందూపురం బంద్

Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
27 May 2022
27 May 2022
27 May 2022
27 May 2022