Breaking News

పంజాబ్ సీఎం ఆఫర్ ను తిరస్కరించిన అంబికా సోని

19 th Sep 2021, UTC

కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన ఒక రోజు తర్వాత పంజాబ్ తదుపరి ముఖ్యమంత్రిగా వుండమన్న కాంగ్రెస్  హైకమాండ్ ప్రతిపాదనను   మాజీ కేంద్రమంత్రి  అంబికా సోని తిరస్కరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీతో  శనివారంఅర్థరాత్రి జరిగిన సమావేశంలో  ఈ ప్రతిపాదనను ఆమె  తిరస్కరించినట్లు తెలిసింది.సిక్కు ముఖ్యమంత్రిగా ఉండకపోవడం వల్ల  పార్టీ   నష్టపోతుందని  శ్రీమతి సోనీ సమావేశంలో స్పష్టం చేశారు.

పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి కొన్ని నెలల ముందు సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్  రాజీనామా చేశారు. శనివారం సమావేశమయిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ కొత్త నేతను ఎంపిక చేసే బాధ్యతను హైకమాండ్ కే వదిలిపెట్టింది. పంజాబ్ కాంగ్రెస్ ఇన్ చార్జి  హరీష్ రావత్ కూడ ఈ సమావేశానికి హాజరయ్యారు. కొత్త సీఎం ఎంపికపై  సోనియా గాంధీ నిర్ణయమే తుది అని ఒక తీర్మానం ఆమోదించబడినట్లు  పంజాబ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పవన్ గోయల్ అన్నారు.

పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సునీల్ జాఖర్, పార్టీ రాష్ట్ర చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మరియు మంత్రి సుఖ్జీందర్ సింగ్ రాంధవా పేర్లు ప్రస్తుతం సీఎం రేసులో వున్నాయి. మాజీ సీఎం అమరీందర్ సింగ్ తన వారసుడిగా నవజ్యోత్ సిద్ధూ ను  తోసిపుచ్చారు నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఒక అసమర్థుడు. అతను నా ప్రభుత్వంలో పూర్తిగా  విఫలమయ్యాడు. నేను అతనికి ఇచ్చిన ఒక మంత్రిత్వ శాఖను అతను నడపలేకపోయాడు. అతను ఏడు నెలలు ఫైల్స్ క్లియర్ చేయలేదని అమరీందర్ సింగ్ అన్నారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox