క్యాట్ వాక్ చేసిన క్యాట్..

204

క్యాట్ వాక్ అనగానే.. ర్యాంప్‌పై మోడల్స్ చేసే వయ్యారపు నడక గుర్తొస్తుంది. కానీ మొరాకోలోని మరకేష్ నగరంలో జరుగుతున్న క్రిస్టియన్ డియోర్ క్రూయిజ్‌ షోలో మాత్రం నిజమైన క్యాట్ ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేసి అందరిని ఆశ్చర్యపరచింది. దానికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోడల్స్ కొత్త డిజైన్లను ప్రదర్శిస్తూ… ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేస్తూ ముందుకెళ్తున్నారు. అదే సమయంలో.. ఓ క్యాట్ ర్యాంప్‌పైకి వచ్చి క్యాట్ వాక్ చేసింది.

అంతే…అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. ఇది నిజమైన క్యాట్ వాక్ అంటూ ఆ పిల్లిని తమ మొబైల్‌లో వీడియో తీశారు. ఆ క్యాట్ మోడల్స్ పక్క నుంచీ వాక్ చేస్తూ చివరకు ఆడియన్స్ దగ్గరకు వెళ్లింది. దాంతో మోడల్స్, డ్రెస్సెస్ కంటే ఆ పిల్లే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ పిల్లి సరిగ్గా నడవలేదనీ, మోడల్స్‌కి అడ్డుగా వెళ్లిందనీ, దానికి సరైన శిక్షణ ఇవ్వలేదనీ నెటిజన్లు జోక్స్ వేస్తున్నారు.