కమెడియన్ గా రీ ఎంట్రీ ఇవ్వబోతున్న బండ్ల గణేష్ ?

తెలుగు తెరపై కమెడియన్ గానే బండ్ల గణేశ్ తన కెరియర్ ను ప్రారంభించాడు. అలా కొన్ని సినిమాల్లో హాస్యనటుడిగా చేసిన ఆయన, ఆ తరువాత నిర్మాతగా మారిపోయి పెద్ద హీరోలతో భారీ చిత్రాలను నిర్మించాడు. కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంటోన్న ఆయన, మళ్లీ నటుడిగా తెరపై కనిపించనున్నాడని తెలుస్తోంది.

మహేశ్ బాబు 26వ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ పైనే ఆయన కసరత్తు చేస్తున్నాడు. ఈ సినిమాలో హాస్యాన్ని పండించే ఒక పాత్రను బండ్ల గణేశ్ తో చేయిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయనను సంప్రదించాడట. ఆ పాత్ర నచ్చడంతో వెంటనే బండ్ల గణేశ్ అంగీకరించాడని అంటున్నారు. కామెడీ ఎపిసోడ్స్ ను తనదైన శైలిలో డిజైన్ చేయడం అనిల్ రావిపూడి ప్రత్యేకత. బండ్ల గణేశ్ పాత్రను ఆయన డిజైన్ చేసిన తీరు కడుపుబ్బ నవ్విస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాతో బండ్ల గణేశ్ ఇక నటుడిగా బిజీ అవుతాడేమో చూడాలి.