గోవాలో షూటింగ్ లకు నిభందనలు…!

21

గోవాలో సినిమా షూటింగ్‌ ఇకపై అంత సులభం కాకపోవచ్చు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో షూటింగ్‌ చేయాలంటే తప్పకుండా సినిమా స్ర్కిప్ట్‌ను అక్కడి అధికారులకు అందచేయాలి. సినిమా స్ర్కిప్ట్‌ చూసి వాళ్లు ఓకే అంటేనే గోవాలో షూటింగ్‌ చేసే అవకాశం దొరుకుతుందని ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ ప్రకటించారు. చాలా సినిమాల్లో గోవాను మాదకద్రవ్యాలకు గమ్యస్థానంగా చూపిస్తున్నారని, అలా చూపించడం వల్ల రాష్ట్ర గౌరవం దెబ్బతింటోందని ముఖ్యమంత్రి తెలిపారు.