ఇకపై ప్రసూతి సేవల ఖర్చు రూ.7,500..!

38

గర్భిణులకు చెల్లించే ప్రసూతి సేవల ఖర్చును రూ.5 వేల నుంచి రూ.7,500కు పెంచుతూ ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఈఎ్‌సఐసీ) నిర్ణయం తీసుకుంది. ఈఎ్‌సఐసీ ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో అనివార్య కారణాలతో సేవలు పొందలేక, వేరే ఆస్పత్రులకు వెళ్లే గర్భిణులకు ప్రసూతి వైద్యం కింద ఈ ఖర్చులు చెల్లిస్తారు. అలాగే 2020-21 నుంచి ఈఎ్‌సఐసీ వైద్య సంస్థల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటాను అమలు చేసేందుకూ ఈఎ్‌సఐసీ ఆమోదం తెలిపింది.