అరుదైన నివాళి..!

11

గత ఏడాది ఇదే రోజున జరిగిన పుల్వామా దాడిని యావత్ దేశం మర్చిపోదు. పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల త్యాగాలకు గుర్తుగా జమ్మూకాశ్మీర్ లోని లెత్‌పోరా శిబిరంలో స్మారకస్తూప ఆవిష్కరణ జరిగింది. ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల పేర్లు, ఫొటోలను ఆ స్తూపంపై ముద్రించి వారికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్రకు చెందిన ఉమేష్ గోపీనాథ్ జాధవ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఉగ్రదాడిలో అమరులైన 40 మంది జవాన్ల ఇంటింటికి వెళ్లి వారి ఇంటి ఆవరణలోని మట్టిని, అంత్యక్రియలు జరిగిన స్థలంలో మట్టిని సేకరించిన ఉమేష్ ఆ మట్టిని స్తూపం వద్ద సమర్పించారు. అయితే, ఇందుకోసం ఆయన దేశవ్యాప్తం గా 61000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, వారందరి కుటుంబాలను కలిసి, వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆ జవానులు కుటుంబాలను కలిసినందుకు తనకు చాలా గర్వం ఉందని ఆయన తెలిపారు. పుల్వామా దాడి జరిగి ఏడాది పూర్తి చేసుకున్న అమరులకు ఏర్పాటు చేసిన స్థూపం వద్ద నివాళులు అర్పించారు.