లాభాల్లో ఎయిర్ ఇండియా..!

21

ప్రభుత్వరంగ ఎయిర్‌‌లైన్‌‌ కంపెనీ ఎయిరిండియా ఎక్స్‌‌ప్రెస్‌‌ అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండగా, ఈ కంపెనీ గత డిసెంబరు 31తో ముగిసిన క్వార్టర్‌‌కు అద్భుతమైన ఫలితాలను ప్రకటించింది. క్యూ3లో రూ.679 కోట్ల లాభం సంపాదించినట్టు గురువారం తెలియజేసింది. ఈ ఏడాది క్రితం క్యూ3లో వచ్చిన రూ.177 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 283 శాతం పెరిగింది. ఇదేకాలంలో ఆదాయం 75 శాతం పెరిగి రూ.3,124 కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ ఆపరేటింగ్‌‌ రెవెన్యూల విలువ రూ.ఐదు వేల కోట్లు దాటుతుందని ఎయిరిండియా ఎక్స్‌‌ప్రెస్‌‌ సీఈఓ శ్యామ్‌‌సుందర్‌‌ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీకి రూ.4,171 కోట్ల ఆదాయం, రూ.168 కోట్ల నికరలాభం వచ్చింది. ఈ ఏడాది వేసవిలో తిరుచురాపల్లి–అబూదబీ, తిరుచురాపల్లి–దోహా ఫ్లైట్లను మొదలుపెడతామని తెలిపింది. తిరుచురాపల్లి–అబూదబీ సర్వీసును వారానికి నాలుగుసార్లు నడిపిస్తారు. దోహా ఫ్లైట్‌‌ వారానికి మూడుసార్లు ఉంటుంది. ఎయిరిండియా ఎక్స్‌‌ప్రెస్‌‌ దగ్గర ప్రస్తుతం 25 బోయింగ్‌‌ 737–800 ఎన్జీ విమానాలు ఉన్నాయి.