జస్టిస్‌ రోహిణి కమీషన్ గడువు పెంపు

14

జాతీయ జాబితాలోని ఓబీసీల వర్గీకరణ కోసం జస్టిస్‌ రోహిణి నేతృత్వంలో పనిచేస్తున్న కమిషన్‌ కాలపరిమితిని కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జులై 31 వరకు పొడిగించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఇందుకు ఆమోదముద్ర వేసింది. కమిషన్‌కు ఇదివరకు అందజేసిన విధి విధానాల జాబితాకు కొత్తగా మరొకటి జత చేసింది. బ్రిటిష్‌ పాలనలో వివిధ వర్గాల పేర్ల నమోదులో అక్షరదోషాలు తలెత్తాయని, వాటిని సరిదిద్దే బాధ్యతను ఇప్పుడు కొత్తగా కమిషన్‌కు అప్పగించినట్లు కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావ్‌డేకర్‌ తెలిపారు.