నేను రబ్బరు స్టాంపును కాను…!

27

పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) సవాలు చేస్తూ కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే ముందు తనను సంప్రదించకపోవడాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ తప్పుపట్టారు. ఇది పోట్రాకాల్ ఉల్లంఘనేనని అన్నారు. దీనిపై గురువారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, సీఏఏను సుప్రీంకోర్టులో సవాలు చేసే ముందు తన ఆమోదం తీసుకోవడం కానీ, కనీసం తనకు సమాచారం ఇవ్వడం కానీ కేరళ ప్రభుత్వం చేయలేదన్నారు. ప్రోటోకాల్ పరంగానే కాకుండా కనీస మర్యాదను కూడా ప్రభుత్వం పాటించలేదన్నారు. గవర్నర్ అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు వెళ్లవచ్చా అనే అంశాన్ని తాను పరిశీలిస్తున్నట్టు చెప్పారు.