సమ్మెకు పిలుపునిచ్చిన బ్యాంకులు..!

56

వేతన సవరణ కు సంబంధించి భారతీయ బ్యాంకుల సంఘం తో చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపధ్యం లో బ్యాంకులు ఈ నెల 31 వ తేదీ మరియు ఫిబ్రవరి 2 వ తేదీన దేశవ్యాప్తం గా సమ్మె జరపనున్నాయి. అంతే కాకుండా, మార్చి నెలలో మరో మూడు రోజులు సమ్మె చేయబోతున్నట్లు తెలిపారు. వేతన సవరణ సమస్యని పరిష్కరించాలని కోరుతూ రాబోయే మూడు నెలల్లో సమ్మెను మరింత విస్తృతం చేస్తామని బ్యాంకు సంఘాలు వెల్లడించాయి.