వచ్చే ఏడాది మరో 15,000 బ్యాంకు శాఖలు

23

దేశంలో బ్యాంకింగ్ సౌకర్యాలు లేని గ్రామాలు, మారుమూల ప్రాంతాలపై కేంద్రం దృష్టి సారించింది. సుమారుగా 15 కిమీ దూరం వున్న ప్రతీ గ్రామంలోనూ బ్యాంక్ లు ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్దికశాఖ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఎస్ బి ఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసిఐసిఐ ఇతర బ్యాంకులు వచ్చే ఏడాదిలో 15,000 కొత్త శాఖలు నెలకొల్పి పౌరులందరికీ బ్యాంకు ఖాతా వుండే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు భోగట్టా.