బీహార్ లో ఎన్నార్సీ అమలు చేయం

32

బిహార్‌లో ఎన్‌ఆర్‌సీని ఎట్టిపరిస్థితుల్లోను అమలు చేసేది లేదని సీఎం నితీష్ కుమార్ స్పష్టం చేశారు. సీఏఏపై పార్లమెంటులో ప్రశ్నించి చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఎన్‌ఆర్‌సీపై జరుగుతున్న వివాదం గురించి ప్రధాని నరేంద్రమోదీ స్పష్టంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. భాజపాయేతర రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్‌, పంజాబ్‌, కేరళతో పాటు పలు రాష్ట్రాలు సీఏఏను అమలు చెయ్యమని ప్రకటించాయి. తాజాగా ఆ జాబితాలోకి ఎన్డీయే మిత్రపక్షమైన బిహార్‌ కూడా చేరింది.