ప్రధానికి లైవ్ డిబేట్ ఒక్కటే మార్గం

16

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై వస్తున్న విమర్శలను ఎదుర్కునేందుకు ప్రధాని నరేంద్ర మోదీకి లైవ్ డిబేట్‌ ఒక్కటే మార్గమని కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం పేర్కొన్నారు. సీఏఏ చట్టం పౌరసత్వం ఇచ్చేందుకే తప్ప తీసి వేయడానికి కాదంటూ తాను చెబుతున్న మాటలను నమ్మని విమర్శకులతో ప్రధాని మోదీ కనీసం చర్చలు జరపడం లేదంటూ ఆయన విమర్శించారు. భారీ వేదికల మీద నుంచి మౌనంగా కూర్చున్న వారితో ప్రధానమంత్రి సీఏఏపై మాట్లాడుతున్నారు. ఎవరి నుంచీ ఒక్క ప్రశ్న కూడా తీసుకోవడం లేదు. కానీ మేము మీడియాతో మాట్లాడుతూ, మీడియా ప్రతినిధుల నుంచి ప్రశ్నలు కూడా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాం.. అని చిదంబరం ట్వీట్ చేశారు. సీఏఏపై విమర్శలు ఎదుర్కునేందుకు ప్రధాని మోదీ లైవ్‌లో చర్చకు రావడమే పరిష్కారమని ఆయన సూచించారు.