కాంగ్రెస్ సమావేశం..!

నేడు సోనియాగాంధీ నివాసంలో ఏఐసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో.. మోడీ సర్కార్ విధానాలకు నిరసనగా పోరాట కార్యాచరణపై చర్చించనున్నారు. అయితే సోనియా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత తొలిసారి సమావేశం కానుండటంతో…ఏ విధంగా ముందుకు వెళ్లనున్నారు అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.