శివసేన ఎదుట ప్రతిపాదనలు పెట్టిన బీజేపీ..!

ప్రభుత్వంలో శివసేన లేకుండా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండదని బిజెపి ప్రకటించింది. దీనికనుగుణంగా శివసేనని బుజ్జగించేందుకు రహస్య సంప్రదింపులు ప్రారంభించింది. తాజా రాజీ ఫార్ములా ప్రకారం మహారాష్ట్రలో శివసేనకి డిప్యూటీ సీఎం పదవితోపాటుగా 13మంత్రి పదవులు ఇస్తామని ఈ ఉదయం బిజెపి ప్రతిపాదించింది. దీంతోపాటుగా కేంద్రంలో కూడా మంత్రిపదవులు ఇస్తామని కాసేపటి క్రితం బిజెపి ఆఫర్ ఇచ్చింది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వంలో ఇచ్చే మంత్రి పదవుల్లో కీలకమైన హోం, ఫైనాన్స్, రెవెన్యూ శాఖలు లేవని సమాచారం. 288మంది సభ్యుల మహారాష్ట్ర అసెంబ్లీలో బిజెపి 105, శివసేన 56 గెలిచాయి. ప్రభుత్వ ఏర్పాటుకి 144 ఎమ్మెల్యేలు అవసరం. బిజెపి శివసేన కూటమికి 161మంది సభ్యుల బలం ఉంది. కాసేపటి క్రితం బీజేపీ శాసనసభాపక్ష సమావేశం అయ్యింది. సమావేశంలో.. ఫడ్నవీస్‌ను శాసనసభాపక్ష నేత