పార్టీ కార్యకర్తలకు టీ పెట్టి ఇచ్చిన దీదీ..!

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తన పార్టీ నేతలను సర్‌ప్రైజ్‌ చేశారు. మమతా ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెళ్లి వస్తూ మార్గమధ్యంలో దిఘాలోని దత్తాపూర్‌లోని ఓ చిన్న టీ దుకాణం వద్ద ఆగారు. కారు దిగి ఆ దుకాణంలోకి వెళ్లారు. దుకాణదారుతో కాసేపు ముచ్చటించి ఆమె స్వయంగా తన పార్టీ కార్యకర్తలకు టీ పెట్టి ఇచ్చారు. సీఎం దుకాణం వద్ద టీ చేస్తున్న దృశ్యం వీక్షించడానికి పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు. దీంతో అక్కడకు సెక్యూరిటీ అక్కడకు చేరుకున్నారు. అయితే మమతా సెక్యూరిటీని దుకాణం వద్దకు రావద్దని చెప్పి అక్కడున్న వారితో కాసేపు మాట్లాడిన అనంతరం ప్రయాణమయ్యారు. ఈ వీడియోను మమత తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. చిన్న చిన్న ఆనందాలు జీవితాన్ని ఆనంద పరుస్తాయి.. అంటూ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.