ప్రతి పక్షాలకు బిగ్ షాక్..!

ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ పునర్విభజన, లడక్ కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటు తరువాత.. దేశంలో అనేక మార్పులు వస్తున్నాయి. ఆర్టికల్ 370 ని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో దాని గురించి ప్రతి పక్షాలకు అలానే జమ్మూ కాశ్మీర్ ప్రజలకు చెప్పబోతున్నారు. గత 72 సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ జమ్మూ కాశ్మీర్ లో ఉన్నారు. అక్కడి ప్రజల మధ్యకు వెళ్లి అక్కడి ప్రజలకు అన్ని విషయాలను వివరిస్తున్నారు.

ఆర్టికల్ 370 రద్దు తరువాత కాశ్మీర్ లో వచ్చే మార్పులను వాళ్లకు వివరిస్తున్నారు. వివిధ రకాల నాయకులతో ఆయన సమావేశం అవుతున్నారు. రోడ్డుపైనే వివిధ నాయకులతో కలిసి భోజనం చేస్తూ వారికీ వివరిస్తున్నారు. ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. గొడవలు జరుగుతాయని భావించిన పాకిస్తాన్ కు భంగపాటు అయ్యింది. మరికొన్ని రోజుల్లో పాక్ లో అంతా నార్మల్ గా మారబోతున్నాడు. ఇకపై కాశ్మీర్ లో రాళ్ళూ రువ్వడం వంటివి కనిపించవు. ప్రతి పౌరుడు సక్రమంగా పనిచేసుకు పోతాడు అనడంలో సందేహం అవసరం లేదు.

ఇదిలా ఉంటె, రెండోసారి మోడీ అధికారంలోకి వచ్చాక మరింత దూకుడును ప్రదర్శించడం మొదలుపెట్టింది. మొదట తలాక్ బిల్లును పాస్ చేసి మహిళలకు వరంగా ఇచ్చింది. ఈ బిల్లుతో ముస్లిం మహిళలు అందందోత్సహాలు వ్యక్తం చేశారు. దీనితరువాత మోడీ ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టి చట్టం చేయడంతో మోడీ ప్రభుత్వం ఏదైనా అనుకుంటే అది చేసితీరుతుంది అనే పేరు వచ్చింది.

ఇప్పుడు ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అదే ఉమ్మడి పౌరస్మతి. ఇప్పటి వరకు దేశంలో వివిధ రకాల న్యాయాలు అమలులో ఉన్నాయి. మతం ఆధారంగా కొన్ని న్యాయాలు అమలు జరుగుతున్నాయి. దీని వలన కొంతవరకు న్యాయం జరుగుతున్నా.. చాలా వరకు అన్యాయం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఒకే దేశం.. ఒకే న్యాయం అనే చట్టాన్ని తీసుకురావాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నారు. కానీ కుదరడం లేదు. ఆర్టికల్ 370 రద్దు తరువాత ఒకే దేశం ఒకే న్యాయం దిశగా అడుగులు వేసే అవకాశం ఉన్నది. ఇదే జరిగితే మోడీ చరిత్రలో నిలిచిపోతాడు అనడంలో సందేహం లేదు.