మంత్రి పదవికి రాజీనామా చేసిన హెచ్‌. నగేష్‌

కర్ణాటకలో ఎమ్మెల్యేల రాజీనామా ఎపిసోడ్ సరికొత్త మలుపు తిరిగింది. కర్ణాటక మంత్రి, స్వతంత్ర ఎమ్మెల్యే నగేష్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సోమవారం గవర్నర్‌ను కలిసిన ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. సంకీర్ణానికి మద్దతు తెలిపిన నగేష్ కుమారస్వామి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కూడా రాజీనామా చేయడంతో కుమారస్వామి ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలినట్టయింది.

నగేష్ ముల్బగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజీనామా చేసిన ఆయన ముంబైలోని రెబల్ ఎమ్మెల్యేల క్యాంపుకు తరలివెళ్లనున్నట్లు తెలిసింది. ఒకవైపు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను దారిలోకి తెచ్చుకునేందుకు సీఎం కుమారస్వామి ప్రయత్నిస్తుంటే మరోవైపు నగేష్ రాజీనామా సీఎంను మరింత సంక్షోభంలోకి నెట్టేసింది. గవర్నర్‌కు నగేష్ సమర్పించిన రాజీనామా లేఖ ఇదే..