బస్‌ డే సెలబ్రేషన్స్‌..!

తమిళనాడు రాజధాని చెన్నైలో విద్యార్థులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వేసవి సెలవుల అనంతరం ఇవాళ తమిళనాడు వ్యాప్తంగా కళాశాలలు తెరిచారు. దీంతో విద్యార్థులు హుషారుగా కాలేజీలకు బయల్దేరారు. బస్‌ డే సెలబ్రేషన్స్‌ సందర్భంగా చెన్నైలో రూట్‌ నంబర్‌ 47 బస్సు ఎక్కిన విద్యార్థులు.. ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తిస్తూ.. బస్సు టాప్‌ పైకి ఎక్కారు. దీన్ని గమనించిన పోలీసులు.. బస్సును ఆపి విద్యార్థులను కిందకు దించారు. మళ్లీ బస్సు కొంచెం దూరం వెళ్లగానే విద్యార్థులు టాప్‌ పైకి ఎక్కి డ్యాన్స్‌లు చేయడం మొదలుపెట్టారు. అయితే బస్సు ముందు వెళ్తున్న బైక్‌ను సడెన్‌గా ఆగిపోయింది. దీంతో సడెన్‌గా బస్సు డ్రైవర్‌ బ్రేకులు వేయడంతో టాప్‌ పైనున్న విద్యార్థులు కింద పడ్డారు.విద్యార్థులంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తమిళనాడులో బస్‌ డే సెలబ్రేషన్స్‌పై నిషేధం ఉంది. అయినప్పటికీ విద్యార్థులు అత్యుత్సాహం ప్రదర్శించారు.