మిస్సైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్రాన్స్‌పోర్ట్ విమానం..!

భారత వాయుసేనకు చెందిన విమానం మిస్ అయినట్టు సమాచారం అందుతోంది. ఈ విమానంలో 8 మంది క్రూ మెంబర్స్ తో పాటు మరో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. మధ్యాహ్నం 12.25 గంటలకు ఏఎన్-32 ఎయిర్ క్రాఫ్ట్ జోర్హట్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ లోని మేచుకాకు బయల్దేరింది. ఒంటి గంట సమయంలో గ్రౌండ్ స్టేషన్ తో సంబంధాలను కోల్పోయింది. విమానం ఆచూకీ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.