కమల్ హాసన్ నాలుక కోసేయాలి ..!

దేశంలో తొలి ఉగ్రవాది ఓ హిందువు అంటూ మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమలహాసన్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ మండిపడ్డారు. ‘హిందూ ఉగ్రవాది నాథూరామ్ గాడ్సే’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కమలహాసన్ నాలుకను కత్తిరించాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మైనార్టీల ఓట్ల కోసమే కమల్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు. ఓ వ్యక్తి కారణంగా మొత్తం మతాన్ని నిందించలేమని చెప్పిన రాజేంద్ర బాలాజీ, మక్కల్ నీది మయ్యం పార్టీపై నిషేధం విధించాలని, కమల్ పై తక్షణ చర్యలకు ఈసీ ఆదేశించాలని కోరారు.