అభినందన్ కు ‘వీర్ చక్ర’!

శత్రుదేశ భూభాగంలో అడుగుపెట్టానని తెలిసి కూడా ఆత్మస్థయిర్యం కోల్పోకుండా దేశ రక్షణ రహస్యాలను కాపాడిన వీర పైలట్ అభినందన్ వర్ధమాన్ పేరును భారత వాయుసేన వీర్ చక్ర అవార్డు కోసం నామినేట్ చేసింది. వీర్ చక్ర పురస్కారం భారతదేశంలో పరమవీర చక్ర, మహావీర చక్ర అవార్డుల తర్వాత మూడో అత్యున్నత అవార్డు. అభినందన్ కనబర్చిన ధైర్యసాహసాలకు వీర్ చక్ర అవార్డు సరైనదని వాయుసేన వర్గాలు భావిస్తున్నాయి. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు.

అభినందన్, బాలాకోట్ సర్జికల్ స్ట్రయిక్స్ తర్వాత పాక్ దుస్సాహసాన్ని తిప్పికొట్టే క్రమంలో తన మిగ్-21 బైసన్ యుద్ధవిమానంతో అద్వితీయ పోరాటం సాగించాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ప్రవేశించి పాక్ కు చెందని అత్యాధునిక ఎఫ్-16 జెట్ ఫైటర్ ను కూల్చేశాడు. ఈ క్రమంలో తాను శత్రుసైన్యాలకు చిక్కినా, సడలని గుండెనిబ్బరంతో వ్యవహరించి దేశ భద్రతకు సంబంధించిన కీలక రహస్యాలను ఎక్కడా బయటపెట్టలేదు. రెండ్రోజుల కస్టడీ అనంతరం పాక్ అతడిని విడిచి పెట్టింది.