టీఆరెస్,కాంగ్రెస్ పార్టీలను ఏకిపారేసిన బీజేపీ నేత డీకే అరుణ !

నల్గొండ: రాష్ట్రంలో అవినీతికి పాల్పడేది రెవెన్యూ అధికారులా ? టీఆర్ఎస్ నాయకులా ? అని బీజేపీ నేత డీకే అరుణ ప్రశ్నించారు. నల్గొండలో బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. చట్టాల్లో మార్పు కోసం సీఎం కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదని హితవుపలికారు. ఓటమి భయంతోనే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రాక ముందే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనేనన్నారు. కాంగ్రెస్‌పై జనంలో నమ్మకం పోయిందని వ్యాఖ్యానించారు. దేశమంతా మరోసారి మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని స్పష్టంచేశారు.