రాహుల్ ఫై నిప్పులు చెరిగిన మోడీ..

హైదరాబాద్‌: డీఎంకే నేత స్టాలిన్ ఒక్కడే రాహుల్ ప్రధాని కావాలని కాంక్షిస్తున్నారని, కానీ మహాకూటమి నేతల్లో ఎవరు కూడా రాహుల్‌కు మద్దతు ఇవ్వడంలేదని ప్రధాని మోదీ అన్నారు. తమిళనాడులోని తేనిలో ఎన్నికల సభలో మాట్లాడుతూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. మహాకూటమి నేతలంతా ప్రధాని కావాలన్న ఉత్సుకతతో ఉన్నారని, అందుకే ఎవరూ రాహుల్‌కు మద్దతు ఇవ్వడం లేదని మోదీ విమర్శించారు. తమిళనాడులో ఎంజీఆర్ గొప్ప పాలన చేశారని, కానీ కాంగ్రెస్ అప్పుడు ఆ ప్రభుత్వాన్ని కూల్చిందన్నారు. ఎంజీఆర్‌, జయలలితకు నివాళి అర్పిస్తున్నట్లు మోదీ చెప్పారు. ఈ ఇద్దరు గొప్ప నేతలను చూసి భారత్ గర్విస్తున్నదన్నారు. ఈ ఇద్దరూ పేదల అభ్యున్నతి కోసం పనిచేశారన్నారు. ప్రపంచ దేశాల్లో భారత్ ప్రగతి వేగంగా దూసుకెళ్లుతున్నదని, కానీ కాంగ్రెస్‌, డీఎంకే, మహాకూటమి మిత్రులు మాత్రం అసంతృప్తితో ఉన్నారని మోదీ విమర్శించారు. సేలంలో ప్రచారం నిర్వహిస్తున్న సీఎం పళనిస్వామి కూడా స్టాలిన్‌ను తప్పుపట్టారు. ప్రతిపక్ష నేతలెవ్వరూ రాహుల్ ప్రధాని కావాలన్న ఉద్దేశంతో లేరన్నారు. కానీ స్టాలిన్ ఒక్కరే రాహుల్‌కు మద్దుత ఇస్తున్నారని విమర్శించారు.