నేడు ఎన్నికల షెడ్యూల్ విడుదల..!

శనివారం మధ్యాహ్నం ఈసీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివారాలను మధ్యాహ్నం 3.30 నిముషాలకు జరగనున్న ప్రత్యేక మీడియా సమావేశంలో వెల్లడించనున్నట్లు సమాచారం. ఎన్నికల కమిషన్ మీటింగ్ పై తెలంగాణలో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. తెలంగాణా ఓటర్ల జాబితా అవకతవకలపై హైకోర్టులో కేసు నడుస్తున్న కారణంగా… ఆ కేసు తేలే వరకూ ఎన్నికలు జరిపించకూడదని ఈసీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ మాత్రమే విడుదలవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. డిసెంబర్ లోగా నాలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడాల్సి ఉంది కనుక ఈ రాష్ట్రలకు సంబంధించిన జాబితా విడుదల కానుంది.

Post expires at 12:13pm on Saturday October 6th, 2018