Breaking News

దేశంలో అత్యంత ధనిక పార్టీగా బీజేపీ

28 th Jan 2022, UTC
 దేశంలో  అత్యంత ధనిక పార్టీగా బీజేపీ

BJP is the richest party in the country:  దేశంలో జాతీయ రాజకీయ పార్టీల్లో బీజేపీ అత్యంత ధనిక పార్టీ నిలిచింది. రెండో  స్థానంలో బీఎస్పీ ఆక్రమించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం బీజేపీ తన ఆస్తుల విలువను 4 వేల 847 కోట్లుగా పేర్కొంది. 698 కోట్లతో బీఎస్పీ రెండో స్థానంలో ఉండగా..  588 కోట్లతో కాంగ్రెస్‌ మూడో స్థానంలో ఉంది. ద అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రీఫామ్స్‌ సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. దేశంలో ఏడు జాతీయ, 44 ప్రాంతీయ పార్టీల ఆస్తులు, అప్పుల వివరాలను ఈ సంస్థ వెల్లడించింది. 

జాతీయ పార్టీల ఆస్తులు రూ. 6 వేల988 కోట్లు కాగా, ప్రాంతీయ పార్టీల ఆస్తులు  2 వేల129 కోట్లుగా ఏడీఆర్ పేర్కొంది. ప్రాంతీయ పార్టీల్లో 563 కోట్లతో సమాజ్‌ వాదీ మొదటిస్థానంలో ఉండగా, 301 కోట్లతో టీఆర్‌ఎస్‌ రెండో స్థానంలో ఉంది. 267 కోట్లతో అన్నా డీఎంకే మూడో స్థానంలో, 188 కోట్లతో టీడీపీ నాలుగో స్థానంలో ఉంది. రికార్డుస్థాయిలో 256 కోట్ల ఫిక్సెడ్‌ డిపాజిట్లను టీఆర్ఎష్ కలిగి ఉంది.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి 

 మురికివాడ నుంచి మైక్రోసాఫ్ట్ వరకూ... ఒక మహిళ ప్రయాణం

 సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు.. డ్రగ్ వ్యాపారి ఫ్లాకోను అరెస్ట్ చేసిన ఎన్‌సిబి

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox