Breaking News

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు నోటిఫికేషన్‌ విడుదల

26 th Jan 2022, UTC

 for formation of new districts in AP:  ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు నోటిఫికేషన్‌ విడుదలైంది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలను మంత్రులకు ఆన్‌లైన్‌లోనే పంపి వారి ఆమోదం తీసుకుంది. కొత్త జిల్లాలు, జిల్లా కేంద్రాలతో నోటిఫికేషన్‌ విడుదల చేశారు. వచ్చే ఉగాది నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త జిల్లాల్లో 18 నుంచి 20 లక్షల జనాభా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.రాష్ట్రంలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలుండగా, అరకు లోక్‌సభ స్థానం భౌగోళిక విస్తీర్ణం చాలా పెద్దది కావడంతో... దాన్ని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్నారు. కొత్త జిల్లాలపై  ఆన్‌లైన్‌లో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ కొత్త జిల్లాల ప్రతిపాదనను మంత్రివర్గం ముందుంచారు. దానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ సమావేశానికి ముందు  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. కొత్త జిల్లాల ప్రక్రియ గురించి వారికి వివరించి, అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు

ఒక లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శానససభ స్థానాలూ కచ్చితంగా దాని పరిధిలోకే రావాలన్న నిబంధన తీసుకోలేదు. ఒక లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏదైనా శాసనసభ స్థానం, కొత్తగా ఏర్పడే పక్క జిల్లా కేంద్రానికి దగ్గర్లో ఉంటే, దాన్ని ఆ జిల్లా పరిధిలోకి తీసుకొచ్చారు.  ఈ మార్పులు, చేర్పుల వల్ల కొన్ని జిల్లాల పరిధిలోకి 8 శాసనసభ నియోజకవర్గాలు వస్తుంటే, కొన్ని జిల్లాలు ఆరు శాసనసభ స్థానాలతోనే ఏర్పాటవుతున్నాయి.   విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాను ఏర్పాటు చేసినట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. కొత్త జిల్లాలో విజయవాడ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, తిరువూరు నియోజకవర్గాలు ఉండనున్నాయి. ఇక మచిలీపట్నం కేంద్రంగా కృష్ణా జిల్లా ఏర్పాటు కానుంది. మచిలీపట్నం, పెడన, గన్నవరం, గుడివాడ, పామర్రు, పెనుమలూరు, అవనిగడ్డ నియోజకవర్గాలు

బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాన్ని  భావపురి జిల్లాగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బాపట్ల, రేపల్లె, వేమూరు, చీరాల, పర్చూరు, అద్దంకి ఉండనున్నాయి. ఇక గుంటూరు జిల్లాలో గుంటూరు ఈస్ట్, వెస్ట్, ప్రత్తిపాడు, పొన్నూరు, తాడికొండ, తెనాలి, మంగళగిరి ఉండనున్నాయి. మరోవైపు నరసరావు పేట కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటు కానుంది. పల్నాడు జిల్లాలో నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, గురజాల, వినుకొండ, మాచర్ల, పెదకూరపాడు, ఉండనున్నాయి. ఒంగోలు కేంద్రంగా ప్రకాశం జిల్లా ఏర్పడనుంది. ఇక కొత్త కొత్త ప్రకాశం జిల్లాలో ఒంగోలు, కొండెపి, దర్శి, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, సంతనూతలపాడు, ఉండనున్నాయి. ఇక నెల్లూరు కేంద్రంగా పొట్టి శ్రీరాములు జిల్లా ఏర్పాటు కానుంది. నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కోవూరు, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, కందుకూరు, సర్వేపల్లి ఉండనున్నాయి. తిరుపతి కేంద్రంగా శ్రీబాలాజీ జిల్లా ఏర్పాటు కానుంది. తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, చంద్రగిరి, వెంకటగిరి, గూడురు, సూళ్లూరుపేట ఉండనున్నాయి. ఇక చిత్తూరు కేంద్రంగా చిత్తూరు జిల్లా ఏర్పనుంది. చిత్తూరు, నగరి, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, పుంగనూరు ఉండనున్నాయి. 

ఇక శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, ఆముదాలవలస, పాతపట్నం, ఎచ్చెర్ల నియోజకవర్గాలు ఉండనున్నాయి. అదే విధంగా విజయనగరం కేంద్రంగా 7 నియోజకవర్గాలతో విజయనగరం జిల్లా ఏర్పాటు కానుంది. విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, గజపతినగరం, బొబ్బిలి, రాజాం, ఎస్‌కోట ఉండనున్నాయి. భౌగోళికంగా సుదీర్ఘ ప్రాంతం, పూర్తి గిరిజన జనాభాతో కూడిన అరకు లోక్‌సభ స్థానాన్ని రెండుగా విభజించి, రెండు జిల్లాలు చేశారు. అయితే జిల్లాకు అరకు పేరు పెట్టలేదు. అరకుని జిల్లా కేంద్రంగా కూడా చేయలేదు.   వాటిలో అల్లూరి సీతారామరాజు పేరుతో పాడేరు కేంద్రంగా ఏర్పాటవుతున్న జిల్లాలో మూడే అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.  ఇక అరకు పార్లమెంట్ నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా విభజించారు. పార్వతీపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు కానుంది. కొత్తగా ఏర్పాటు కానున్న పార్వతీపురం జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉండనున్నాయి. పార్వతీపురం,కురుపాం,సాలూరు, పాలకొండ ఉండనున్నాయి. పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామారాజు జిల్లాలో అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాలు ఉండనున్నాయి.

 రాజమండ్రి కేంద్రంగా తూర్పు గోదావరి జిల్లా ఏర్పాటు కానుంది. కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం, రాజమండ్రిసిటి, రాజమండ్రి రూరల్‌, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాలు  కొత్త ఏర్పాటైన జిల్లాలో విలీనం కానున్నాయి. ఇక కాకినాడ కేంద్రంగా ఏర్పాటు కానున్న కాకినాడ జిల్లాలో కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, తుని, పెద్దాపురం నియోజకవర్గాలు ఉండనున్నాయి. అదే విధంగా అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జిల్లాలో అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, ముమ్మిడివరం, కొత్తపేట, మండపేట, రామచంద్రపురం నియోజకవర్గాలు ఉండనున్నాయి.భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పాటుకానున్నాయి. నరసాపురం, ఉండి, భీమవరం, పాలకొల్లు, ఆచంట, తణుకు, తాడేపల్లి గూడెం నియోజకవర్గాలు ఉండనున్నాయి. అదే విధంగా ఏలూరు కేంద్రంగా ఏర్పాటైన ఏలూరు జిల్లాలో ఏలూరు, చింతలపూడి, దెందులూరు, పోలవరం,ఉంగుటూరు, నూజివీడు,కైకలూరు నియోజకవర్గాలు ఉండనున్నాయి. 

రాజంపేట కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటు కానుంది. రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గాలు... కడప కేంద్రంగా కొత్తగా ఏర్పాటైన జిల్లాలో కడప, పులివెందుల, జమ్మలమడుగు,పొద్దుటూరు, కమలాపురం,మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాలు ఉండనున్నాయి. ఇక కర్నూలు జిల్లా రెండుగా విభజించబడింది. నంద్యాల కేంద్రంగా  నందికట్కుకూరు, శ్రీశైలం, ఆళ్లగడ్డ, డోన్‌, బనగానపల్లి, నంద్యాల నియోజకవర్గాలతో ఒక జిల్లా ఏర్పాటైంది. అదే విధంగా కర్నూలు  కేంద్రంగా  కర్నూలు,కొడుమూరు, ఎమ్మిగనూరు,ఆదోని, మంత్రాలయం, ఆలూరు,పత్తికొండ, పాణ్యం నియోజకవర్గాలతో కొత్త జిల్లాగా రూపాంతరం చెందింది.ఇక అనంతపురం కేంద్రంగా అనంతపురం, శింగనమల, తాడిపత్రి, గుంతకల్లు, ఉరవకొండ కళ్యాణదుర్గం, రాయదుర్గం , రాప్తాడు నియోజకవర్గాలు ఉండనుండగా.. హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లాగా ఏర్పాటు కానుంది. ఇక ఈ జిల్లాలో హిందూపురం,పెనుకొండ, మడకశిర,పుట్టపర్తి,ధర్మవరం,కదిరి నియోజకవర్గాలు ఉండనున్నాయి. కొత్తగా ఏర్పాటైన జిల్లాలు ఉగాది నుంచి అమలులోకి వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు చదవండి 

ఏపీ, తెలంగాణలో రిపబ్లిక్ వేడుకలు

రిపబ్లిక్ డే సందర్బంగా సాయుద దళాల సిబ్బందికి గ్యాలంటరీ అవార్డులు

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox