బ్రిటన్ ఆర్థిక మంత్రిగా నారాయణమూర్తి అల్లుడు..!

73

బ్రిటన్ ఆర్థిక మంత్రిగా భారత సంతతి వ్యక్తి, ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్ పేరును ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ గురువారం ఖరారు చేశారు. దీంతో ప్రధాని తర్వాత ఆ దేశంలో అతి ముఖ్యమైన రెండో పదవిగా పేరొందిన ఆర్థిక శాఖను సునక్ దక్కించుకున్నట్లైంది. ప్రస్తుత ఆర్థిక మంత్రి సజిద్ జావిద్ తన పదవికి రాజీనామా చేయడంతో సునక్‌ను తన మంత్రివర్గంలో తీసుకుంటున్నట్లు ప్రధాని ప్రకటించారు.