కరోనా వస్తే ఉరి తీస్తారా..?

28

కరోనా వైరస్ విస్తృతం గా వ్యాప్తి చెందుతున్న నేపధ్యం లో అన్ని దేశాలు పటిష్టమైన భద్రతా నియమాలను పాటిస్తున్నాయి. వైరస్ వ్యాపించిన వారికీ చికిత్సను అందించడానికి, మరోవైపు దాని వ్యాప్తిని నివారించడానికి విశేషం గా కృషి చేస్తున్నాయి. ఇది ఇలా ఉంటే, మరోవైపు ఉత్తర కొరియా ఇందుకు పూర్తి భిన్నం గా వ్యవహరిస్తోంది. వృత్తి ధర్మం లో భాగంగా చైనా కు వెళ్లి వచ్చిన ఓ ప్రభుత్వ అధికారిని కరోనా ఉందన్న అనుమానం తో దారుణం గా చంపేసింది. ఉత్తర కొరియా అధికారులు ఆ అధికారిని మొదట నిర్బంధించారు. అయితే ఆ అధికారి ఓ పబ్లిక్ బాత్ రూంలో స్నానం చేయడానికి వెళుతున్న సమయంలో అధికారులు గుర్తించి ఉరితీసి చంపారు.

     ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ నియంతృత్వ పోకడలను చాటిచెప్పే ఈ ఘటనపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కరోనా వైరస్ తమ దేశం లో వ్యాప్తి చెందకుండా ఉండటానికి కఠినమైన ఆంక్షలను, సైనిక నియమాలను అమలు చేస్తోంది. అంతేకాదు చైనా నుంచి వచ్చిన వారిని, చైనా ప్రజలను నిర్బంధించాలని ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాలు జారీచేశారు. చైనాతో సరిహద్దులను మూసివేశారు. పర్యాటకులను నిషేధించింది.