కేన్సర్‌ చికిత్సకు టీ-సెల్‌ థెరపీ

6

కేన్సర్‌ చికిత్సలో విప్లవాత్మక టీ-సెల్‌థెరపీ ని అభివృద్ధి చేసినందుకు అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం ఇమ్యునోథెరఫీ ప్రొఫెసర్‌ కార్ల్‌ హెచ్‌ జూన్‌కు బయో ఏషియా నుంచి జీనోమ్‌ వ్యాలీ ఎక్స్‌లెన్స్‌ అవార్డు లభించింది. ఫార్మాస్యూటికల్‌ కంపెనీ నోవార్టిస్‌ సీఈఓ వాస్‌ నరసింహన్‌కు కూడా ఈ అవార్డును ప్రదానం చేస్తున్నట్లు బయో ఏషియా సీఈఓ శక్తి నాగప్పన్‌ తెలిపారు. నోవార్టి్‌సలో వ్యూహాత్మక, సాంస్కృతిక మార్పులు తీసుకువచ్చినందుకు, నోవార్టి్‌సను ప్రపంచంలో ప్రధాన ఔషద కంపెనీగా తీర్చిదిద్దినందుకు ఆయనకు ఈ అవార్డు ఇస్తున్నట్లు ప్రకటించారు. బయో ఏషియా పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏడాది బయోటెక్నాలజీ, జీవ శాస్త్రాల సదస్సును హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది. ఈ నెల 17 నుంచి 19 తేదీల్లో ఈ సదస్సు జరగనుంది. సదస్సులో వీరికి జీనోమ్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డులను ప్రదానం చేయనున్నారు.