ఫార్మాకు ప్రత్యేక టెర్మినల్‌..!

9

హైదరాబాద్‌ను లాజిస్టిక్స్‌ కేంద్రంగా మార్చే ప్రయత్నంలో శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కార్గో హ్యాండ్లిం గ్‌ సామర్థ్యాన్ని పెంచుకోవడంతోపాటు.. విమానాశ్రయంలో ప్రత్యేక సదుపాయాలను ఏర్పా టు చేయనుంది. ఫార్మా పరిశ్రమకు హైదరాబాద్‌ కేంద్రంగా ఉంది. ఇక్కడి నుంచి ఔషధాల విమాన రవాణాను పెంచడానికి వచ్చే రెండేళ్లలో విమానాశ్రయంలో ఫార్మా కార్గో రవాణాకు, పళ్లు, పదార్థాల రవాణాకు ప్రత్యేక టెర్మినళ్లను ఏర్పాటు చేయనున్నట్లు జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ సీఈఓ ఎస్‌జీకే కిషోర్‌ తెలిపారు. ఎక్స్‌ప్రెస్‌ కార్గో కోసం ప్రత్యేక సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్గో హ్యాండ్లింగ్‌ సామర్థ్యాన్ని లక్ష టన్నుల నుంచి 3 లక్షల టన్నులకు పెంచనున్నట్లు చెప్పారు. . విమానాశ్రయ ప్రాంగణంలో 100 ఎకరాల్లో లాజిస్టిక్‌ పార్కును ఏర్పాటు చేస్తున్నామన్నారు.. కార్గో రవాణాను పెంచడానికి ఎజిలిటీ వంటి లాజిస్టిక్స్‌ కంపెనీలతో విమానాశ్రయం చేతులు కలుపుతోందని, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల్లోని ఔషఽధ, ఇతర పారిశ్రామిక కేంద్రాలు హైదరాబాద్‌ నుంచి విమాన రవాణా చేయడానికి అక్కడి కంపెనీలతో చర్చలు జరుపుతున్నామన్నారు.