ఉగ్రవాదులతో పోలీసుల మిలాఖత్

20

కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదులతో సబంధాలున్న ఓ పోలీసు అధికారి పట్టుబడ్డారు. ఆయనతోపాటు ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. శ్రీనగర్‌ విమానాశ్రయంలో వ్యూహాత్మక అపహరణ నిరోధక బృందంలో పనిచేస్తున్న దవీందర్‌ సింగ్‌ కారులో ఇద్దరు ఉగ్రవాదులను తీసుకెళుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ ఉగ్రవాదుల్లో ఒకడైన నవీద్‌ కానిస్టేబుల్‌గా పనిచేసేవాడని వెల్లడించారు. ఇలా వుండగా జమ్మూ-కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా త్రాల్‌లో భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.