ఇరాన్ లో నిరసనలు..!

36

తమ పొరపాటు వల్లే ఉక్రెయిన్‌ విమానం కూలిందని ఇరాన్‌ అంగీకరించడంతో ఆ దేశంలో వేలాది మంది నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు. ఇరాన్‌లో ఉన్నది అబద్ధాల కోరు ప్రభుత్వమని, అయతుల్లా ఖమైనీ వెంటనే గద్దె దిగిపోవాలని నినదించారు. ఆందోళనకారులు వర్సిటీల ఎదుట తమ నిరసన కార్యక్రమాలను చేపట్టారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించారు. విమానం కూలిన ఘటనపై ఇరాన్‌ సైన్యం, ఉన్నతాధికారులు క్షమాపణలు చెప్పినప్పటికీ ఖమైనీ ఇంకా పెదవి విప్పకపోవడం గమనార్హం.