అల్-ఖైదాకు మా దేశమే శిక్షణ ఇచ్చింది’: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్..!

పాకిస్తాన్ గూఢచర్య సంస్థ.. ఐఎస్ఐ.. అల్‌-ఖైదా మిలిటెంట్ సంస్థకు శిక్షణ ఇచ్చిందని ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అంగీకరించారు.సోవియట్ సైన్యంతో పోరాడటానికి అఫ్గానిస్తాన్‌లో మిలిటెంట్ బృందాలను పాక్ తయారు చేసిందని ఆయన ఒప్పుకున్నారు.9/11 దాడుల తర్వాత అమెరికాకు సహకరించి పాకిస్తాన్ పెద్ద తప్పు చేసిందని కూడా ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు.

న్యూయార్క్‌లో ‘కౌన్సిల్ ఆన్ ఫారెన్ రిలేషన్స్ (సీఎఫ్ఆర్)’ అనే ఓ మేధో సంస్థ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ అభిప్రాయంపై స్పందన కోరినప్పుడు, ”పాకిస్తాన్‌లో మిలిటెన్సీ ఎందుకు పెరిగిందో, మాటిస్ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారనుకుంటా” అని ఇమ్రాన్ అన్నారు. 80వ దశకంలో ఏర్పడిన పరిస్థితుల గురించి మాట్లాడారు.

”1980లో సోవియట్ యూనియన్ అఫ్గానిస్తాన్‌పై దాడి చేసింది. అమెరికాతో కలిసి పాకిస్తాన్ దీన్ని ప్రతిఘటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలిటెంట్లను పిలిపించి, పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ శిక్షణ ఇచ్చింది. సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా జిహాద్ చేసేందుకు సిద్ధం చేసింది. ఇలా మిలిటెంట్ సంస్థలను తయారుచేసింది” అని ఇమ్రాన్ వివరించారు.