భారతీయులకు ఇది అంకితం చేస్తున్నా: మోదీ

38

భారత ప్రధాని నరేంద్ర మోదీని యూఏఈ ప్రభుత్వం తమ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ జాయేద్ తో గౌరవించిన సంగతి తెలిసిందే. దీనిపై మోదీ స్పందిస్తూ, 130 కోట్ల మంది భారతీయులకు ఈ పురస్కారాన్ని అంకితం ఇస్తున్నానంటూ ట్వీట్ చేశారు. వ్యక్తిగా కంటే దేశ సాంస్కృతిక వైభవానికి దక్కిన గుర్తింపుగా ఈ పురస్కారాన్ని భావిస్తానని తెలిపారు. ఆర్డర్ ఆఫ్ జాయేద్ పురస్కారం లభించడం పట్ల ఎంతో సంతోషిస్తున్నానని పేర్కొన్నారు. ఈ గౌరవాన్ని తనకు అందించినందుకు యూఏఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు ట్వీట్ చేశారు.