ఢిల్లీ చేరిన కర్ణాటక రాజకీయం..

కర్ణాటక రాజకీయం ఢిల్లీ చేరింది. కర్ణాటక రెబెల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ రాజీనామాలపై కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కావాలనే జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. రెబెల్ ఎమ్మెల్యేల పిటిషన్ పై సుప్రీంకోర్టు రేపు విచారించనున్నట్టు సమాచారం. రెబెల్ ఎమ్మెల్యేల తరపున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదించనున్నారు. ఇదిలా ఉండగా, ముంబై క్యాంప్ లోనే కర్ణాటక రెబెల్ ఎమ్మల్యేలు ఉన్నారు. రెబెల్ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్ వద్ద  ఈ నెల 12 వరకు 144 సెక్షన్ విధించారు.