దేశవ్యాప్తంగా 300 చోట్ల దాడులు.. దేశవ్యాప్తంగా 800 మంది అరెస్ట్!

రైళ్లలో మినరల్ వాటర్ పేరుతో నల్లా నీళ్లను సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లపై రైల్వేశాఖ కొరడా ఝుళిపించింది. రైళ్లలో అందజేస్తున్న ఆహారపదార్థాలు, ఇతర సౌకర్యాలపై తనిఖీలు చేపట్టింది.  ఈ విషయమై కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 300 చోట్ల రైల్వే అధికారులు దాడులు చేశారని తెలిపారు. ఈ తనిఖీల్లో భాగంగా నాలుగు పాంట్రీ కార్ల మేనేజర్లతో పాటు 800 మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. అలాగే కల్తీ నీరు ఉన్న 48,860 బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ప్రయాణికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఈ తనిఖీలు చేపట్టామన్నారు.